వసతి.. అధోగతి
నూతన భవనం నిర్మించాలి
హాస్టల్‌కి దారి లేదు
ఏలూరు (మెట్రో): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. అసలే చలికాలం, ఆపై నేలమీద నిద్ర, నాణ్యతలేని భోజనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు హాస్టళ్లలో వసతుల లేమి కనిపిస్తోంది. 3వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వరకూ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే వీరంతా సమస్యల సుడిగుండంలోనే విద్యను కొనసాగిస్తున్నారు.
సుమారు 16 వేలకు పైగా..
జిల్లాలో సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో సుమారు 16 వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 58 బాలురు, బాలికల వసతి గృహాలు, 38 బీసీ బాలబాలికల వసతి గృహాలు, 6 ఎస్టీ బాలబాలికల వసతిగృహాలు ఉన్నాయి. మొత్తంగా 102 హాస్టళ్లు ఉండగా వీటిలో కొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉన్నారు. 3, 4 తరగతి విద్యార్థులకు డైట్ చార్జీల పేరుతో రూ.1,150, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,400, కాస్మోటిక్ చార్జీల రూపంలో నెలకు రూ.200, రూ.150 ఇచ్చేవారు. అయితే చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్మోటిక్ చార్జీలకు ఎగనామం పెట్టింది
భోజనం.. నాసిరకం
జిల్లావ్యాప్తంగా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నా చిమిడిన అన్నం, ఉడకని అన్నంతోనే విద్యార్థులు కడుపు నింపుకుంటున్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందడం లేదు. కొన్నిచోట్ల ఆర్‌ఓ ప్లాంట్లు ఉన్నా మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయని విద్యార్థులు అంటున్నారు.
అమలు కాని మెనూ
కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బీసీ హాస్టళ్లు 7, ఎస్సీ హాస్టళ్లు 6 ఉన్నాయి. వీటిలో బీసీ బాలుర 5, బాలికలు 2,ఎస్సీ బాలికలు 4, బాలుర 2 వసతి గృహాలు ఉన్నాయి. మొత్తంలో బీసీ 2, ఎస్సీ 2 కాలేజీ హాస్టళ్లు నడుస్తున్నాయి. మండవల్లి ఎస్సీ హాస్టల్‌లో మెనూ ప్రకారం దొండకాయ వేపుడు, అరటిపండు పెట్టలేదు. అక్కడ విద్యార్థులు కేవలం పప్పు, పలచని రసం మాత్రమే వడ్డించారని చెప్పారు.
బాలికలకు రక్షణ కరువు
ముసునూరు: ముసునూరులోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో వసతుల లేమితో పాటు విద్యార్థినులకు రక్షణ కరువైంది. హాస్టల్ ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండడం, హైస్కూల్‌కు ఆనుకుని ఉండటంతో రాత్రిళ్లు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ పనిచేసే వారంతా స్థానిక అధికార పార్టీకి చెందిన వారని, దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. గుడ్డు, పాలు, అరటి పండు అప్పుడప్పుడూ మాత్రమే ఇస్తున్నారని తెలిసింది. నైట్ వాచ్ ఉమన్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు.
సంక్షోభంలో హాస్టళ్లు
వసతి గృహాల్లో అరకొర వసతులు
వేధిస్తున్న సౌకర్యాల కొరత
విద్యార్థులకు అందని కాస్మోటిక్స్ సాయం
నేలపైనే నిద్ర, భోజనం
సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కారు
25 ఏళ్ల నుంచి బీసీ బాలుర హాస్టల్‌ను అద్దెకు తీసుకుని పాత భవనంలో నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో కిటికీలు, తలుపులు సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం. సరైన డ్రైనేజీ లేక వర్షం నీటితో నిండిపోతుంది. ప్రభుత్వం నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి.
–మారుబోయిన గౌతమరాజు, 10వ తరగతి, కామవరపుకోట
జంగారెడ్డిగూడెంలో బీసీ హాస్టల్‌కి దారిలేక ఇబ్బదులు పడుతున్నాం. పలుమార్లు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు రోడ్డు గురించి ఫిర్యాదు చేశాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్‌కి వె వెళ్లే రోడ్డు నిర్మించాలి.
– గుమ్మళ్ల ప్రశాంత్, 9వ తరగతి, జంగారెడ్డిగూడెం
వసతి.. అధోగతి
వసతి.. అధోగతి
వసతి.. అధోగతి
వసతి.. అధోగతి


