నిధులు విడుదల చేయాలంటూ నిరసన
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపల్ సా ధారణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని వెంటనే వాటిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ కౌ న్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం బత్తిన లక్ష్మి అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్మన్ ముప్పిడి అంజి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసనగా సమావేశపు హాల్‌లోకి వచ్చారు. హాల్‌లో ప్లకార్డులు ప్రదర్శించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ మున్సిపల్ నిధులు రూ.8.5 కోట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ధ్వజమెత్తారు. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు నిలిచి పోయాయన్నారు. గతంలో చేసిన అభివృద్ది పనుల కు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, కాంట్రా క్టర్లు కొత్తగా చేపట్టే పనులు చేపట్టడం లేదన్నారు. బిల్లులు చెల్లిస్తే కొత్త పనులు జరిగే అవకాశం ఉంటుందన్నారు. గత సమావేశంలో స్వయంగా మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వమే నిధులను ఫ్రీజ్ చేసిందని, ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉందని చెప్పారన్నారు. ప్రభుత్వం వా టిని విడుదల చేస్తేనేగాని నిధుల రావని చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో నిధులను వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరో వైస్ చైర్మన్ కంచర్ల వాసవీ రత్నం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వాడీవేడిగా సమావేశం
మున్సిపల్ సాధారణ సమావేశం వాడీవేడిగా సా గింది. చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా వైస్ చైర్మన్ ముప్పిడి అంజి, చిటికెల అచ్చిరాజు గ్రేడ్–1 అప్‌గ్రేడ్‌పై మాట్లాడగా కొద్దిసేపు వాదనలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయ, శానిటేషన్ సిబ్బందిని పెంచాలని సమావేశం తీర్మానించింది. పట్టణాభివృద్ధికి అధికారులు, కౌన్సిలర్లు సంయుక్తంగా సహకరించాలని కోరారు.


