ఇస్లాం ఉగ్రవాదం నేర్పదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇస్లాం ధర్మం ఉగ్రవాదం నేర్పదని జమ్ యియ్యత్ అహ్లెహదీస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షేక్ ఫజుల్ రహ్మాన్ ఖురైషి ఉమరి అన్నారు. జమ యియ్యత్ అహ్లెహదీస్ కార్యవర్గ సభ్యుల త్రైమాసిక సమావేశం శనివారం స్థానిక పెన్షన్ లైన్ మసీదులో జరిగింది. ఈ సందర్భంగా ఫజుల్ రెహ్మాన్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలో వదలకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదలు మతం పేరు వాడుకొని ధర్మ పవిత్రతను నాశనం చేస్తున్నారన్నారు. ఉగ్రవాదులకు ధర్మమూ, మతమూ ఉండదదన్నారు. ఈనెల 17న మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో పవిత్ర శ్రీఉమ్ఙ్రా కు వెళ్ళిన అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈనెల 30న జరగబోయే సిరాతె ముస్తఖీమ్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


