మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 3వ ఏడాది వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన సహచర విద్యార్థులు ఏలూరు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి చదువులో ప్రతిభ చూపుతాడనీ, వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై అధిక మోతాదులో పారాసిట్మల్ ట్యాబ్లెట్లు మింగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వైద్య అధికారులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి వైద్య విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించారు.


