హోరాహోరీగా హ్యాండ్‌బాల్ పోటీలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. పూల్ సిలో విన్నర్‌గా వెస్ట్ గోదావరి, రన్నర్‌గా విజయనగరం జట్లు నిలిచాయి.
హనుమాన్‌జంక్షన్ రూరల్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో భవానీ భక్తుడు మృతి చెందాడు. బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తణుకు సమీపంలోని సజ్జాపురానికి చెందిన కుక్కనూరి జయరామ్ (33) భవానీ దీక్ష విరమణ నిమిత్తం స్నేహితుడు అలబాని సాయితేజతో కలిసి సోమవారం పల్సర్ బైక్‌పై విజయవాడ దుర్గ గుడికి బయలుదేరారు. దర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో జయరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
హోరాహోరీగా హ్యాండ్‌బాల్ పోటీలు


