
మెడికల్ షాప్, ల్యాబ్, క్లినిక్‌లలో తనిఖీలు
కామవరపుకోట: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి స్‌కే బీబీ జాన్, డీఎంహెచ్‌ఓ కార్యాలయ అడ్వకేట్ వడ్డీ సత్యా రవి స్థానిక కొత్తూరులో ఉన్న మందులు షాపు, క్లినిక్, ల్యాబ్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సాయిరాం క్లినిక్, దుర్గా మెడికల్ షాప్, శ్రీ సాయిరాం డయాగ్నస్టిక్ సెంటర్, సాయిరాం క్లినిక్, సాయిరాం మెడికల్ షాప్‌లో తనిఖీలు చేయగా సాయిరాం క్లినిక్‌లో 20 ఏళ్లుగా వైద్యం చేస్తున్న వ్యక్తికి సరైన సర్టిఫికెట్లు లేవని, అతను వైద్యం చేసేందుకు అనర్హుడని గుర్తించారు. శ్రీ సాయిరాం డయగ్నొస్టిక్ సెంటర్ టెక్నీషియన్‌కు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు నివేదికి ఇస్తామని వైద్యాధికారి పి.బీబీ జాన్ తెలిపారు.