
●ఇరుకు వంతెనతో యాతన
గరగపర్రులో భీమవరం–తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న వంతెనపై భారీ కంటైనర్ శుక్రవారం సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించేది లేదని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోకపోవడంతో యథావిధిగా వాహనాలు తిరుగుతున్నాయి.
– పాలకోడేరు