వృద్ధులే టార్గెట్‌గా దాడులు, చోరీలు | - | Sakshi
Sakshi News home page

వృద్ధులే టార్గెట్‌గా దాడులు, చోరీలు

Jul 5 2025 6:08 AM | Updated on Jul 5 2025 6:08 AM

వృద్ధులే టార్గెట్‌గా దాడులు, చోరీలు

వృద్ధులే టార్గెట్‌గా దాడులు, చోరీలు

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో వృద్ధులను టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కేసులను పోలీస్‌ యంత్రాంగం ఛేదించింది. కై కలూరు రూరల్‌ పరిధిలో వృద్ధులను కొట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళిన దొంగలను పట్టుకున్న పోలీసులు, భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఊలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ కేసుల వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం రామవరంలో ఒంటరిగా జీవిస్తోన్న వృద్ధ మహిళలను టార్గెట్‌ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను కై కలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌ పట్టుకున్నారు. రామవరం గ్రామంలో భర్త చనిపోయి గూడూరు నాగలక్ష్మి ఒంటరిగా ఉంటుంది. మే నెల 28తేదీ రాత్రి 9.20గంటల సమయంలో ఇంట్లోకి చోరబడిన ఇద్దరు దొంగలు ఆమె తలకు ముసుగు వేసి చేతులతో ముఖంపై తీవ్రంగా కొట్టి గోడకు తలను కొట్టారు. ఆమె సృహతప్పి పడిపోవటంతో మెడలోని ఐదు కాసుల బంగారు చైన్‌, రెండు చేతులకు ఉన్న రెండు బంగారపు గాజులు లాక్కుని చనిపోయిందనే ఉద్దేశ్యంతో పరారయ్యారు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో రూరల్‌ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కై కలూరు మండలం రామవరం గ్రామానికి చెందిన పంతగాని జాన్‌కుమార్‌, గరికిముక్కు రాజ్‌కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారు చైన్‌, 24గ్రాముల రెండు బంగారు గాజులు రికవరీ చేశారు.

బంగారు గాజుల చోరీ

కై కలూరు మండలం రామవరంలో సోము సీతామహాలక్ష్మి ఒంటరిగా ఉంటూ కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న పగటి వేళ ఆమె దుకాణం వద్దకు వెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా లోనికి వెళ్లిరెండు బంగారు గాజులు చోరీ చేసి పరారయ్యారు. దీనిపై కై కలూరు రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ అధికారులు రామవరం గ్రామానికి చెందిన భూపతి ప్రదీప్‌ అలియాస్‌ బన్ను, కురెళ్ళ సుబ్బారావు అలియాస్‌ సుబ్బు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితుల నుంచి రూ.1 లక్ష నగదును స్వాదీనం చేసుకున్నారు.

రికవరీ సొమ్ము అందజేత

కై కలూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలో మూడు కేసులు, మండవల్లి స్టేషన్‌ పరిధిలో మూడు కేసులు, ముదినేపల్లి స్టేషన్‌ పరిధిలో రెండు కేసుల్లో మొత్తంగా సుమారు రూ.12,21,126 విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటో, నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ రికవరీ నగదు, నగలు, వస్తువులను బాధితులకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ చేతులమీదుగా అందజేశారు. సైబర్‌ నేరగాళ్ళబారిన పడి పోగొట్టుకున్న మరో రూ.2లక్షల నగదును సైబర్‌ సెల్‌ సీఐ దాసు, కానిస్టేబుల్‌ శివ ఆధ్వర్యంలో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ అభీబ్‌ భాషా ఉన్నారు.

నలుగురు నిందితుల అరెస్ట్‌, భారీగా రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement