
● నయనానందకరం.. జగన్నాథుని రథోత్సవం
ఏలూరు నగరంలో జగన్నాథుని రథోత్సవం నయనానందకరంగా సాగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. వందలాది మంది భక్తులు నృత్యాలు, కీర్తనలు, గానాలు, కోలాట ప్రదర్శనలతో నగర వీధుల్లో ఆనందోత్సాహాల నడుమ రథం వెంట నడిచారు. రథంపై ఊరేగిన జగన్నాథుడు, బలదేవ్, సుభద్ర మహారాణి ఉత్సవ విగ్రహాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద విందు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
– ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)

● నయనానందకరం.. జగన్నాథుని రథోత్సవం