
ప్రమాదాలకు ఎదురెళ్లి..
తాడేపల్లిగూడెం రూరల్: వాహనదారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే లెవల్ క్రాసింగ్‌లు దాటుతున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రత్తిపాడు, మారంపల్లి, నవాబుపాలెం వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్‌లున్నాయి. రైలు రాకపోకలను గుర్తించిన వెంటనే సంబంధిత సిబ్బంది లెవల్ క్రాసింగ్‌ల వద్ద ముందస్తుగానే గేట్లను మూసివేస్తుంటారు. కొందరు వాహనదారులు మాత్రం అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. గేటు వేసినా గేటు కింద నుంచి క్రాసింగ్‌లను దాటుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే లెవల్ క్రాసింగ్‌లను దాటుతున్న సమయంలో రెప్పపాటులో ప్రమాదాలు తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదాలకు ఎదురెళ్లి..