
పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
ఏలూరులోని తమ్మిలేరులో దిగి ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించారు. 8లో u
గిరిజన ఆర్‌ఎస్‌కేఐల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గిరిజన ప్రాంతాల్లోపని చేసే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టీ కల్చర్ అసిస్టెంట్ల (రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు) (ఆర్‌ఎస్‌కేఐ)ను గిరిజన ప్రాంతాల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని కేఆర్‌పురంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏలూరులోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం వద్ద శనివారం రాత్రి 10 గంటల నుంచి ధర్నాకు దిగారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌కే హబీబ్ బాషా వివరణ కోరగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 461 రైతు సవా కేంద్రాలు ఉండగా, ఏలూరు జిల్లా పరిధిలో 172 అగ్రికల్చరల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని, రేషనలైజేషన్ ప్రకారం వాటిలో 140 ఏలూరు జిల్లాకు, మిగిలిన 32 పోస్టులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాయన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీలు నిర్వహించాల్సి ఉన్నందున నిబంధనల మేరకే బదిలీల కౌన్సెలింగ్ తలపెట్టామని వివరణ ఇచ్చారు.