
బడి దూరం.. చదువు భారం
జల విద్యుత్ కేంద్ర పనుల పరిశీలన
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్‌కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్‌కుమార్ అన్నారు. 8లో u
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: విలీనం పేరుతో విద్యాలయాలు విచ్ఛిన్నం చేశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే రీతిలో ఒక్కో విద్యార్థిని ఒక్కో బడిలో చేర్చారు. అది కూడా సమీపంలో కాదు 5, 8, 10 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేయడంతో పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పూర్వంలో కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చదువుకున్నారనే విషయాన్ని పెద్దలు చెబుతుంటారు.. మళ్లీ కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మొదలు టీచర్ల వరకూ సర్వత్రా మండిపడుతున్నారు. విలీనం పేరుతో ఏలూరు జిల్లాలో 297 పాఠశాలలను విజయవంతంగా మాయం చేశారు.
1,788 బడులు.. 1,27,699 మంది పిల్లలు
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,788 ప్రభుత్వ పాఠశాలల్లో 1,27,699 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశారు. వందల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పాఠశాలల రూపురేఖలు మొదలు బోధనా రంగం వరకు అన్ని వ్యవస్థల్లో గుణాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రధానంగా బడికి పిల్లలు వెళితే తల్లుల ఖాతాల్లో ఏటా అమ్మఒడి పేరుతో నాలుగేళ్ల కాల వ్యవధిలో రూ.1,069.26 కోట్లకుపైగా జమ చేశారు. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ మొదలు యూనిఫామ్స్ వరకు ఉచితంగా అందజేశారు. నాడు–నేడు పేరుతో జిల్లాలో రెండు విడతల్లో రూ.414.48 కోట్ల వ్యయంతో 1,488 పాఠశాలల రూపురేఖలను మార్చారు. ఇవి కాకుండా విద్యార్థులకు ట్యాబ్‌లు, ఇంగ్లిష్ విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి సమూల మార్పులు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంపై కక్ష కట్టింది. కొత్త కొత్త నియమ నిబంధనలు, అడ్డగోలు విఽధి విధానాలతో పాఠశాలల విలీనానికి తెరతీసింది.
న్యూస్‌రీల్
ఇష్టానుసారం విలీనం.. విద్యార్థులకు దూరాభారం
జిల్లాలో 297 పాఠశాలలను అడ్డగోలు నిబంధనల పేరుతో విలీనం చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను 9 రకాల పాఠశాలలుగా మార్చారు. వీటిలో శాటిలైట్ పాఠశాలలు 7, ఫౌండేషన్ పాఠశాలలు 127, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు 928, మోడల్ ప్రైమరీ పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలలు 78, ఉన్నత పాఠశాలలు 241లుగా మార్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఒకే ఊరిలో రెండు స్కూల్స్ ఉంటే వాటిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే స్కూల్‌కు మార్చడం ఇలా ఇష్టానుసారంగా మార్చడంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సమస్యలు మొదలయ్యాయి. దీనిపై మండల స్థాయిలో తల్లిదండ్రులు అభ్యంతరాలు తెలిపి స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించని పరిస్థితి.
విద్యార్థులకు విలీన కష్టాలు
విలీనం పేరుతో పాఠశాలలు విచ్ఛిన్నం
జిల్లాలో 297 బడులు విలీనం
కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లల్లోకి కొన్ని..
5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోకి మరికొన్ని..
విలీన వ్యవహారంపై సర్వత్రా మండిపాటు
ఫిర్యాదుల వెల్లువ.. స్పందించని అధికారులు

బడి దూరం.. చదువు భారం

బడి దూరం.. చదువు భారం