
డీఈడీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ
భీమవరం: భీమవరానికి చెందిన సంగడి ఏదిత హాసిని డీఈడీ (టీచర్స్ ట్రైనింగ్) కోర్సు ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణ మావుళ్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
8లో
విలీనం.. అవస్థల మయం
● కై కలూరు మండలంలో గతంలో 12 అప్పర్ ప్రైమరీ పాఠశాలలుండగా నేడు ఆ సంఖ్య 1కి చేరింది. మండలంలో వింజరం, గోపవరం, రామవరం, ఆచవరం, వెలంపేట, కై కలూరులో రెండు పాఠశాలలు ఇలా యూపీ స్కూల్స్‌లో 6,7,8 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. దీని వల్ల విద్యార్థులకు దూరాభారం పెరిగింది. గోపవరం యూపీ స్కూల్‌లో గతేడాది వరకు 6,7,8 తరగతుల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది 5 కిలోమీటర్ల దూరంలోని ఆరుతెగళ్లపాడు హైస్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. కై కలూరు మండలం అయి నా రైల్వేట్రాక్, హైవే రహదారి కావడంతో ఇబ్బందులు పడుతూ కొందరు స్కూళ్లకు వెళ్తుండగా మరికొందరు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఒక్క గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులే 70 మంది దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
● ముదినేపల్లి మండలంలో 9 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను రెండు హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసి 7 పాఠశాలలను సమీప హైస్కూళ్లలో విలీనం చేశారు. వీటిలో కోడూరు, కొరగుంటపాలెంకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోడూరులోని 6, 7, 8 తరగతుల విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాలపర్రు లేదా ముదినేపల్లి హైస్కూళ్లకు వెళ్తున్నారు. కొరగుంటపాలెం యూపీ పాఠశాలలను ఎత్తివేయడంతో 5 కిలోమీటర్ల దూరంలో అల్లూరు లేదా బొమ్మినంపాడు హైస్కూళ్లకు వెళ్లాల్సి పరిస్థితి. ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో గందరగోళం నడుమ విలీన ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టించింది.