
పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తును 45 నుంచి 41 అడుగులకు తగ్గించారని, 80 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. విభజన హామీల అమలులో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు, పవన్ ఆ పార్టీతోనే కూటమి కట్టారని, మోదీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాసోహం అంటున్నారని మండిపడ్డారు.