
షూటింగ్ పోటీల్లో బంగారు పతకాలు
నూజివీడు: నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మనుమడు మేకా జై నృసింహా ప్రతాప్ అప్పారావు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ అండర్–18 విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించాడు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న 11వ రాష్ట్ర షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. అండర్–18 యూత్ మెన్స్ కేటగిరిలో నృసింహ ప్రతిభ కనబరిచి ట్రాప్, డబుల్ ట్రాప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న నృసింహ అక్టోబర్‌లో చైన్నెలో నిర్వహించే సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొననున్నాడు. స్కూల్‌లో బాస్కెట్‌బాల్ జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించిన బాస్కెట్‌బాల్ పోటీల్లో తమ స్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలవడంలో ప్రతిభ కనబరిచాడు. భారతదేశానికి ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
శిల్పి కరుణాకర్‌కు తానా ఆహ్వానం
పెనుమంట్ర: అమెరికాలో మిచిగన్‌లో జూలై 3 నుంచి మూడు రోజులు పాటు జరిగే తానా మహాసభలకు పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెనుగొండ కరుణాకర్‌కు ఆహ్వానం లభించింది. ఈ నెల 30న అమెరికాకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బాలికకు గాయాలు
భీమవరం: భీమవరం రెండో పట్టణంలోని డాక్టర్ బీవీ రాజు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న అక్కాచెల్లెళ్లను శుక్రవారం వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. సైకిల్ వెనుక కూర్చొన్న బాలిక చేతికి, కాలికి గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ జి. కాళీచరణ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

షూటింగ్ పోటీల్లో బంగారు పతకాలు