
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలని ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) తణుకు శాఖ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను ఆప్కాస్ నుంచి తొలగించవద్దని, ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా పర్మినెంట్ చేయా లని కోరారు. ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అమలుచేయాలని, జీతాలు పెంచాలని, కార్మికుల రిటైర్‌మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు.