నిరుద్యోగ భృతి జాడేది? | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి జాడేది?

Jun 6 2025 6:27 AM | Updated on Jun 6 2025 6:27 AM

నిరుద

నిరుద్యోగ భృతి జాడేది?

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ.. కూటమి నాయకులు గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఈ హామీలను అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడ దీశారు. రాజకీయ కక్షతో వలంటీర్‌, ఎండీయూ వాహనాల వ్యవస్థలను రద్దు చేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. అలాగే ఆప్కాస్‌ రద్దుకు ప్రయత్నాలు చేయడం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తంగా కూటమి ఏడాది పాలనపై యువత గుర్రుగా ఉన్నారు.

శురకవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఏలూరు (టూటౌన్‌): ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌.. స్వీట్‌ సిక్స్‌ అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యు వత ఆందోళన వ్యక్తం అవు తోంది. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హా మీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మో సం చేసిందంటూ మండిపడుతున్నారు.

వలంటీర్లు, ఎండీయూ వాహనాలు రద్దు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు తీసుకువచ్చిన వలంటీర్‌, ఎండీయూ వాహన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జిల్లాలో 10,800 వలంటీర్లు వీధిన పడ్డారు. అలాగే ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాలను నిలిపివేయడంతో జిల్లాలో 800 మంది ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడ్డారు.

జిల్లాలో 1.50 లక్షలకు పైగా నిరుద్యోగులు

జిల్లాలో 16.50 లక్షల మంది వరకు జనాభా ఉండగా వీరిలో 8 నుంచి 10 శాతం మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. ఈ లెక్కన జిల్లాలో 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తుందని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆగ్రహం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన ఆప్కాస్‌ విధానం రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉండటంపై కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు, సంస్థలు, వ్యక్తులు లేకుండా ఆప్కాస్‌ ద్వారా నేరుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ మొత్తాలను ఖాతాల్లో జమచేయడం ద్వారా జిల్లాలో సుమారు 10 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ రద్దు చేసి మరలా పాత విధానాన్ని ప్రవేశపెడితే తమకు కష్టాలు తప్పవంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగ

భృతి

ఎప్పుడు?

ఉద్యోగాల మాటేంటి?

న్యూస్‌రీల్‌

జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది ?

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. తొలగించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి నెలకు రూ.10 వేలు వేతనం అందించాలి.

– జి.సూర్యకిరణ్‌,

జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ, ఏలూరు

సూపర్‌ సిక్స్‌ అమలులో విఫలం

కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో విఫలమైంది. ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న తల్లికి వందనం హామీ ఏమైంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. వెంటనే నిరుద్యోగ భృతి విడుదల చేయాలి.

– కె.లెనిన్‌, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, ఏలూరు

యువతకు లేదు భవిత

నిరుద్యోగ భృతి ఊసే లేదు

ఉద్యోగాల కల్పనపై నిర్లక్ష్యం

వలంటీర్‌, ఎండీయూ వాహన వ్యవస్థలు రద్దు

కూటమి పాలనపై నిరుద్యోగుల మండిపాటు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనకు పెద్దపీట

మెగా కాదు దగా డీఎస్సీ

కూటమి అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ నాయకులు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కిన ఏడాది తర్వాత కంటి తుడుపు చర్యగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే సమయం తక్కువ ఇవ్వడం, ఒకే జిల్లా ఒకే పేపర్‌ వంటి డిమాండ్లను పట్టించుకోకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.

నిరుద్యోగ భృతి జాడేది? 1
1/4

నిరుద్యోగ భృతి జాడేది?

నిరుద్యోగ భృతి జాడేది? 2
2/4

నిరుద్యోగ భృతి జాడేది?

నిరుద్యోగ భృతి జాడేది? 3
3/4

నిరుద్యోగ భృతి జాడేది?

నిరుద్యోగ భృతి జాడేది? 4
4/4

నిరుద్యోగ భృతి జాడేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement