బరువులెత్తారు.. సత్తా చాటారు | - | Sakshi
Sakshi News home page

బరువులెత్తారు.. సత్తా చాటారు

May 26 2025 12:30 AM | Updated on May 26 2025 12:30 AM

బరువు

బరువులెత్తారు.. సత్తా చాటారు

అమలాపురం టౌన్‌: అమలాపురం హెల్త్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సర్‌ సీవీ రామన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం 3వ యునైటెడ్‌ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ అండ్‌ బెంచ్‌ ప్రెస్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలు ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 135 మంది క్రీడాకారులు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. తొలుత ఈ క్రీడను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు ప్రారంభించారు. పవర్‌ లిఫ్టింగ్‌, బ్రెంచ్‌ ప్రెస్‌, వుమెన్‌, మాస్టర్‌ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 53 కిలోల నుంచి 260 కిలోల వరకూ బరువులను లిఫ్టర్లు ఎత్తారు. 53 కిలోలు, 59, 66, 74, 83, 93, 105 కిలోలు ఇలా పలు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. వీటికి న్యాయ నిర్ణేతలుగా కాకినాడ ప్రభుత్వ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ దొమ్మేటి వెంకటరమణ, రాజమహేంద్రవరానికి చెందిన ఇంటర్నేషనల్‌ లిఫ్టర్‌, రైల్వే ఉద్యోగి డి.లక్ష్మీనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన మరో ఇంటర్నేషనల్‌ లిఫ్టర్‌ ఎ.బాలకృష్ణ, పి.గన్నవరానికి చెందిన సీనియర్‌ లిఫ్టర్‌ కత్తుల శ్రీనివాసరావులు వ్యవహరించారు. పోటీల్లో కేటగిరీల వారీగా విజేతలైన లిఫ్టర్లకు ఎప్పటికప్పుడు పోటీల నిర్వహణా సంస్థలైన హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అసోసియేషన్లు పతకాలు, బహుమతులు,ఽ సర్టిఫికెట్లు అందజేశాయి. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ కోచ్‌ డాక్టర్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు, కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, పట్టణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల గణేష్‌, నల్లా చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నల్లా పవన్‌కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు, సర్‌ సీవీ రామన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రవణం వేణుగోపాలరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూదా గణపతి తదితర పట్టణ ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ కళాశాలలకు చెందిన ఫిజికల్‌ డైరెక్టర్లు కరాటం రవి సుధీర్‌, డీఆర్కే నాగేశ్వరరావు, జోషఫ్‌లు పోటీలకు రిఫరీలుగా వ్యవహరించారు.

ఉత్కంఠగా పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

135 మంది క్రీడాకారుల రాక

బరువులెత్తారు.. సత్తా చాటారు1
1/1

బరువులెత్తారు.. సత్తా చాటారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement