ఆరు నెలలకే శిశువు జననం
ప్రత్తిపాడు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన తూరంగి సుహాసిని ఆరు నెలల గర్భిణి. ఆరు నెలలు గడిచి రెండు రోజులైనా కాకముందే నొప్పులు రావడంతో 108 అంబులెన్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం అయ్యింది. నవజాత శిశువుకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో సీహెచ్‌సీ సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్యురాలు బి.సౌమ్యమైఖేల్ బృందం తక్షణ చికిత్సలు అందించారు. శిశువు సాధారణ స్థితికి రావడంతో తల్లి క్షేమంగా ఉంది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు కేవలం 800 గ్రాముల బరువుతో క్షేమంగా ఉండడం విశేషమని డాక్టర్ సౌమ్యమైఖేల్ చెప్పారు. శిశువు ఊపిరితిత్తులు వృద్ధి చెందక పోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
తల్లీ బిడ్డా క్షేమం


