ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక వైఎస్సార్ స్కేటింగ్ రింక్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ రోలర్ స్కేటింగ్ పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో రింక్–1, రింక్–2, ఇన్‌లైన్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మంగళవారం నిర్వహించిన పోటీలను మహబూబ్ బాషా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విజేతలకు మహబూబ్ బాషా, హరిష్, రవిచంద్ర బహుమతులు అందజేశారు. ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీను, సీనియర్ పీడీలు జార్జి, రవిరాజు, జాన్, కౌర్, పరశురామ్, సురేష్‌రాజు పాల్గొన్నారు.
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు


