
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ.75 లక్షలు చెల్లిస
అంబాజీపేట: వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలి మృతిచెందినవారి కుటుంబాలకు రూ.75 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు, కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషరావు కుటుంబ సభ్యులను పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులు పత్తి దత్తుడు, కుంపట్ల శ్రీనివాసరావుకు పార్టీ తరఫున చెరో రూ.2లక్షల నగదును అందజేశారు. జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. పిల్లర్లు లేకుండా 70 అడుగుల పొడవున 18 అడుగుల ఎత్తులో అవినీతి నిర్మాణం చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం డబ్బు కు కక్కుర్తిపడి నాణ్యత లేకుండా నిర్మించిన గోడ వల్లే ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ న్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మృతుల కుటుంబాలకు రూ.75 లక్షలను అందిస్తామని పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, దానిని తప్పకుండా అమలు చేస్తామన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పాముల రాజేశ్వరిదేవి, దొమ్మేటి సత్యమోహన్, పి.కె.రావు, మందపాటి కిరణ్‌కుమార్, కొర్లపాటి కోటబాబు, జక్కంపూడి వాసు, ఉందుర్తి నాగబాబు, సూదాబత్తుల రాము, మట్టపర్తి హరి, కోట బేబిరాణి పాల్గొన్నారు.
సింహాచలం దుర్ఘటన బాధిత
కుటుంబాలకు రూ.2 లక్షలు అందజేత

వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ.75 లక్షలు చెల్లిస