
ప్రజా రవాణా అధికారి కార్యాలయం ముట్టడి
అమలాపురం రూరల్: స్థానిక ఆర్టీసీ డిపోలో 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యాన జిల్లాలోని అన్ని డిపోలకు చెందిన ఆర్డీసీ ఉద్యోగులు మంగళ వారం జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయా న్ని ముట్టడించారు. డ్రైవర్ నారాయణను అన్యా యంగా సస్పెండ్ చేశారని, 78 రోజులుగా ఉద్య మం చేస్తే సస్పెన్షన్ ఎత్తివేశారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కె.పద్మ, కోశాధికారి మోహన్, జిల్లా అధ్యక్షుడు బండి ముత్యాలరావు మాట్లాడుతూ, అక్రమ సస్పెన్షన్లు, తొలగింపులు ఆపాలని, పదో న్నతులు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, సిక్ లీవులకు పూర్తి జీతం చెల్లించాలని, పాత వైద్య విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి.గణపతి మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ నుంచి మినహాయించి, అన్ లిమిటెడ్ రిఫరల్ వైద్యం కల్పించాలని కోరారు. ఆందోళనలో యూనియన్ డిపో కార్యదర్శి కె.రవికుమార్, రామచంద్రపురం డిపో కార్యదర్శి వరలక్ష్మి, రామచంద్రపురం డిపో అధ్యక్షులు నారాయ ణ, బూరమ్మ, అమలాపురం డిపో ప్రచార కార్య దర్శి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి డెల్టా సిస్టం
సీఈగా శ్రీరామకృష్ణ
ధవళేశ్వరం: గోదావరి డెల్టా సిస్టం సీఈగా ఆర్.శ్రీరామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎస్‌ఈగా ఉన్న ఆయన ఇప్పటికే గోదావరి డెల్టా సిస్టం సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇప్పుడు పూర్తి స్థాయి సీఈగా నియమితులయ్యారు.