బడి బస్సుల భద్రత ఎంత?! | - | Sakshi
Sakshi News home page

బడి బస్సుల భద్రత ఎంత?!

May 13 2025 12:13 AM | Updated on May 13 2025 12:13 AM

బడి బ

బడి బస్సుల భద్రత ఎంత?!

ఆన్‌లైన్లో తేదీల ఖరారు

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణాశాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహన ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్‌లైన్లో నమోదు చేశాక ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్‌నెస్‌ తనిఖీ చేస్తారు. వాహన కండిషన్‌పై సమగ్ర పరిశీలన అనంతరం ఽఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సులు ఏ విధంగా ఉండాలన్న దానిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది.

ఈ నెల 15తో ముగుస్తున్న పాత ఎఫ్‌సీ గడువు

కొత్తగా ఎఫ్‌సీలు జారీచేస్తున్న అధికారులు

స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు తప్పనిసరి

జిల్లాలో 835 పాఠశాల, కళాశాల

బస్సులు

రాయవరం: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సుల వినియోగం పెరిగింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్‌ విద్యా సంస్థలు 580 వరకు ఉన్నాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక శాతం మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. బస్సు సామర్థ్యం సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ఏటా మోటార్‌ వెహికల్‌ తనిఖీ అధికారులు బస్సు కండిషన్‌ చెక్‌ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు ఈ నెల 14తో ముగియడంతో, ఈ నెల 15 నుంచి కొత్తగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్‌నెస్‌) ఎలా ఉంది? అన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు.

835 పాఠశాల బస్సులు

కోనసీమ జిల్లాలో 580 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో 835 ప్రైవేట్‌ బస్సులు, వ్యాన్‌లు ఉన్నాయి. జూన్‌ 15వ తేదీలోగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు పొందాల్సి ఉంది. 2017 నుంచి స్కూల్‌ బస్సులకు స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. స్కూల్‌ బస్సుల వేగం గంటకు 60 కిటోమీటర్లు మించి ఉండకూడదు.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ నిబంధనలివీ..

బస్సు డ్రైవర్‌కు బీపీ, సుగర్‌, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్‌ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్‌ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్‌ కండిషన్‌లో ఉండాలి. స్పీడో మీటర్‌ పనిచేయాలి. స్టీరింగ్‌, టైర్లు కండిషన్‌లో ఉండాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్‌ కమిటీ ఈ ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్‌ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం విద్యాశాఖ, ట్రాన్స్‌పోర్ట్‌, పోలీస్‌, సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్‌ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్‌ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్‌లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్‌ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్‌ ఉండాలి. సీటింగ్‌ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్‌ ప్లాన్‌ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్‌ తప్పకుండా యూనిఫామ్‌ ధరించాలి.

నిబంధనలు పాటించకుంటే సీజ్‌ చేస్తాం

మోటార్‌ వాహనాల నిబంధనలు పాటించని పాఠశాల, కళాశాలల బస్సులను సీజ్‌ చేస్తాం. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్‌సీ, పర్మిట్‌, కండిషన్‌ లేని బస్సులను సీజ్‌ చేస్తాం.

– డి.శ్రీనివాసరావు,

జిల్లా రవాణాశాఖ అధికారి,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

బడి బస్సుల భద్రత ఎంత?!1
1/1

బడి బస్సుల భద్రత ఎంత?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement