
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కపిలేశ్వరపురం: గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు జారిపడి మృతిచెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. మండపేట పట్టణం శ్రీనగర్‌కు చెందిన అవివాహితుడు దాసరి సాయిరాం (28), పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వివాహితుడు మొండెం రాంబాబు, మంగళవారం కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని ధనమ్మమర్రికి దైవ దర్శనానికి వెళ్లారు. వారితో పాటు మరో ఇద్దరు కూడా వెళ్లారు. దర్శనం అనంతరం గోదావరి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ పరిశీలించారు. శవపంచనామా అనంతరం మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు సీఐ దొరరాజు తెలిపారు.
నెలక్రితం ఇదే విధంగా..
ఒకసారి ప్రమాదం జరిగిందంటే మరోసారి జరక్కుండా ఉండేలా ఎవరికి వారు జాగ్రత్త పడతారు. అదే బాధ్యత ప్రభుత్వానికీ ఉండాలి. ఏప్రిల్ 5న కపిలేశ్వరపురం మండలం కేదారిలంకలో గోదావరిలో యువకుడు స్నానానికి దిగి మృతిచెందాడు. దుర్ఘటన జరిగిన నెలరోజులకే అదే గ్రామంలో మరో ప్రమాదం మంగళవారం జరిగింది. ఏప్రిల్‌లో జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత మరో ప్రమాదం జరక్కుండా తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేదారిలంక వద్ద గోదావరిలో
ఇద్దరు గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం
ధనమ్మమర్రి సందర్శనకు
వచ్చిన యువకులు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి