కలెక్టరేట్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌ డెస్క్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌ డెస్క్‌

Mar 8 2025 12:09 AM | Updated on Mar 8 2025 12:09 AM

కలెక్టరేట్‌లో విదేశీ  వ్యవహారాల హెల్ప్‌ డెస్క్‌

కలెక్టరేట్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌ డెస్క్‌

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

సాక్షి, అమలాపురం: ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం కలెక్టర్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. వారం రోజులలో నలుగురు సిబ్బందితో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించేలే ఈ డెస్క్‌ పని ప్రారంభిస్తుందని తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కో ఆర్డినేషన్‌ సెక్షన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌లతో ఆయన సమావేశం నిర్వహించి డెస్క్‌ విధివిధానాలను వివరించారు. ఏజెంట్ల, సంప్రదింపుదారుల ద్వారా విదేశాలకు వెళ్లి మోసపోకుండా ఈ విభాగం తోడ్పడుతుందన్నారు. హెల్ప్‌ డెస్క్‌ను ఆశ్రయిస్తే 18 దేశాలలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పనకు మార్గ నిర్దేశం చేస్తూ ప్రభుత్వపరంగా పాస్‌పోర్ట్‌ వీసా అనుమతులకు సహకరిస్తుందన్నారు. అక్కడి ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతులు, అత్యవసర సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముందుగా కరపత్రాన్ని ముద్రించి ఇవ్వనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. సంబంధిత సమాచారంతో జాగృతం చేస్తూ హెల్ప్‌ డెస్క్‌ తపాలా శాఖకు సిఫారసు చేస్తుందన్నారు. జిల్లా ప్రజలు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సామాజిక ప్రసార సాధనాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. సందేహాలుంటే 08856–236 388 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. జేసీ టి.నిశాంతి, డీఆర్వో బిఎల్‌ఎన్‌ రాజకుమారి, సమన్వయకర్త జి.రమేష్‌, పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.నవీన్‌ కుమార్‌, పోస్టల్‌ అధికారి అనిల్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల 2కె రన్‌

కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్‌ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్‌ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏ ర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement