ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 2 2025 12:05 AM | Updated on Mar 2 2025 12:05 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

13,230 మంది విద్యార్థుల హాజరు

761 మంది గైర్హాజరు

అమలాపురం టౌన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ జనరల్‌, ఒకేషనల్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సరం ఫౌండేషన్‌ కోర్సులకు పరీక్షలు జరిగాయి. మొత్తం 40 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో తొలి రోజు ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు. మొత్తం 13,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 13,230 మంది హాజరయ్యారు. 761 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు ఆధ్వర్యంలో జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో పరీక్షలు మొదలయ్యాయి. అమలాపురంలోని డీఐఈఓ కార్యాలయం నుంచి డీఐఈఓ సోమశేఖరరావు జిల్లాలో ప్రారంభమైన పరీక్షలను ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పరిశీలించారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా విలసవిల్లి

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

ఉప్పలగుప్తం: హైందవ ధర్మానికి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసవిల్లి గ్రామం విరాజిల్లుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విలసవిల్లి రామ మందిరంలో పవిత్ర మాఘమాసం పురస్కరించుకొని నెల రోజులుగా జరుగుతున్న మహా సౌరయాగ వార్షికోత్సవ పూజల్లో ఎమ్మెల్సీ శనివారం పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు వేదమంత్రాలతో స్వాగతించారు. యాగం విశిష్టతను యాగకర్త మున్నంగి రామకృష్ణశర్మ వివరించి, త్రిమూర్తులుకు వేద ఆశీర్వచనం అందించారు. ఉషా, ఛాయా, పద్మినీ సమేత సూర్య భగవానుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. సర్పంచ్‌ సలాది ఊర్మిళాదేవి, వైఎస్సార్‌ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సలాది సతీష్‌, నాయకులు నడింపల్లి గిరిబాబు, శ్రీ తోట రాము, గంధం శ్రీనివాసరావు, నిమ్మకాయల గోపాలరావు, సలాది రవి, కోలాఏసు, కొలిశెట్టి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం 1
1/1

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement