
ప్రశాంతంగా ‘నీట్’
● 677 మంది విద్యార్థులు హాజరు ● 33 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. చిత్తూరులోని రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 710 మంది విద్యార్థులకు గాను 677 మంది విద్యార్థుళు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరైనట్లు పరీక్షల సిటీ కో–ఆర్డినేటర్ జీవనజ్యోతి వెల్లడించారు.
ముందుగానే కేంద్రాలకు
పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే విద్యార్థులను ఆయా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు ముందస్తుగా వెల్లడించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు.
అధికారుల తనిఖీ
పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చిత్తూరు ఆర్‌డీఓ శ్రీనివాసులు,ప్రిన్సిపల్ మనోహర్, ఏఆర్ డీఎస్పీ మహబుబ్‌బాషా, పీవీకేఎన్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శరవణ పాల్గొన్నారు.