Discounts of Rs 1 Lakh on Volkswagen Virtus and Taigun - Sakshi
Sakshi News home page

Volkswagen Offers: ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ల జాతర.. టైగన్, వర్టస్ కొనుగోలుకు ఇదే మంచి సమయం!

Jun 23 2023 8:28 PM | Updated on Jun 23 2023 8:56 PM

Discounts of rs 1 lakh on volkswagen virtus and taigun - Sakshi

ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కంపెనీ ఎట్టకేలకు తన టైగన్ అండ్ వర్టస్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం 2022 - 2023 మోడల్ కార్లకు, BS6 ఫేజ్-2 కంప్లైంట్ ఇంజన్‌లతో నడిచే కార్లకు మాత్రమే లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్
2022 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మీద రూ. 1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కూడా వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి తగ్గింపులు ప్రారంభమవుతాయి. టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్‌ మీద అత్యధిక తగ్గింపు, కంఫర్ట్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యల్ప తగ్గింపు లభిస్తుంది. అయితే 2023 మోడల్ మీద రూ. 85,000 వరకు లభిస్తుంది. 

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
ఇక ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ విషయానికి వస్తే.. కంపెనీ 2022 మోడల్ ఇయర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల తగ్గింపుని ప్రకటించింది. ఇది కూడా కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్‌లకు అత్యధికంగా లభిస్తుంది. మరో వైపు జీటీ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 20000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ ఇయర్ వర్టస్ కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్‌లపై రూ. 85,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

(ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!)

ఆఫర్స్ అనేవి నగరం నుంచి మరో నగరానికి లేదా డీలర్ నుంచి మరో డీలర్‌కి మారే అవకాశం ఉంటుంది. కావున టైగన్, వర్టస్ వేరియంట్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement