ఈ వీడియో చూసి బద్దకం వదిలేయండి బాసూ..! | Anand Mahindra Shares Video Viral Social Media | Sakshi
Sakshi News home page

బద్దకంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌

Aug 1 2021 3:05 PM | Updated on Aug 1 2021 3:05 PM

Anand Mahindra Shares Video Viral Social Media - Sakshi

నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది. మనలో చాలా మందికి ఆదివారం వచ్చిందంటే వ్యాయామం చేసేందుకు ఇష్టపడరు. అయితే దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. 

జిమ్నాస్ట్‌ల విన్యాసాల్ని షేర్‌ చేస్తూ..ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికోసం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు.

సండే రోజు నీరసంగా ఉండేవాళ్లలో ఎనర్జీని నింపేందుకు ఓ పరిష్కారం ఉంది. నేను ఎలాగైతే వీడియోని సేవ్‌ చేసుకున్నానో, మీరు సేవ్‌ చేసుకోండి. సేవ్‌ చేసుకోవడమే కాదు. కనీసం రెండుసార్లు ఈ వీడియో చూడాలి. ఇలా చూస్తే చాలు శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు అలసిపోతారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement