రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు | - | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు

Jun 2 2025 12:29 AM | Updated on Jun 2 2025 12:29 AM

రూ.5

రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు

వైరా: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన వైరా రిజర్వాయర్‌ ఆనకట్ట రూపురేఖలు కోల్పోతోంది. నైజాంల కాలం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు జిల్లాలోనే ప్రాధాన్యత ఉంది. కానీ అటు అధికారుల, ఇటు పాలకుల పట్టింపులేని తనంతో ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వైరా రిజర్వాయర్‌ ఆనకట్ట అభివృద్ధికి 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.5.30 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 2.5 మీటర్లు ఉన్న ఆనకట్టను 8మీటర్లుగా వెడల్పు చేయడంతో పాటు బతుకమ్మ ఘాట్‌, 2.5 కి.మీ. మేర ఆనకట్టపై రెయిలింగ్‌ ఏర్పాటుచేసి, లాన్‌ తీర్చిదిద్దారు. అంతేకాక కట్ట పొడవున సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయగా.. ఇప్పుడు అవేమీ కానరావడం లేదు. అటు రిజర్వాయర్‌, ఇటు మినీ ట్యాంకు బండ్‌గా పేరున్నా సేద తీరాలని వచ్చే వారికి అసౌకర్యాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి.

దెబ్బతిన్న రెయిలింగ్‌

రిజర్వాయర్‌ ఆనకట్టను సుమారు వందేళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ 2019 సంవత్సరంలో చేపట్టిన పనులు ఐదేళ్లు దాటకముందే నాణ్యతాలోపంతో దెబ్బతింటున్నాయి. ఇప్పటికే అర కిలో మీటర్‌కు పైగా ఆనకట్టుకు రెయిలింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదిలాగే వదిలేస్తే ప్రమాదకర స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఆనకట్టపై రూ.20లక్షలు వెచ్చించి పచ్చటి గడ్డితో తీర్చిదిద్దిన లాన్‌ సైతం ఆనవాళ్లు కోల్పోయి పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.

కానరాని సోలార్‌ లైట్లు, ప్యానళ్లు

రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా నిర్వహణ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం రూ. 35 లక్షలతో 2.5 కి.మీ. పొడవులో 73 సోలార్‌ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ చాలా వాటి బ్యాటరీలు, ప్యానెళ్లు, లైట్లు చోరీ కావడంతో ఇప్పుడు పదికి మించి లైట్లు వెలగడం లేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్న అధికారులు కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో సాయంత్రం వేళ ఆనకట్టపైకి వచ్చే పర్యాటకులు, వాకర్లు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయాన ఆకతాయిల తీరుతో మహిళలకు అవస్త ఎదురవుతోంది. అంతేకాక బతుకమ్మ ఘాట్‌ మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం వేళ ఇక్కడ మద్యం సేవిస్తున్న పలువురు బాటిళ్లు పగులగొట్టి వదిలేస్తుండడం గమనార్హం.

పర్యవేక్షణ లోపంతోనే..

రిజర్వాయర్‌ ఆనకట్ట పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యం పొందినా అటు నీటి పారుదల శాఖ, మున్సిపల్‌, పర్యాటక శాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడం లేదు. ఫలితంగా నిర్వహణ లోపంతో ఆనవాళ్లు కోల్పోతుంది. సాయంత్రమైనా పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తే ఆకతాయిలకు అడ్డుకట్ట పడుతుంది. అలాగే, రెయిలింగ్‌ పగుళ్ల వద్ద మరమ్మతులు చేసి, పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.

వైరా రిజర్వాయర్‌ ఆనకట్టకు పగుళ్లు

ట్యాంక్‌బండ్‌ పనుల్లోనూ అదే పరిస్థితి

ఆసక్తిగా వచ్చే స్థానికులు,

పర్యాటకులకు నిరాశ

మరమ్మతులు చేపడతాం..

రిజర్వాయర్‌ ఆనకట్ట రెయిలింగ్‌కు పగుళ్లు వచ్చిన చోట మరమ్మతు చేయిస్తాం. అలాగే, మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి పిచ్చి మొక్కలు తీయించడమే కాక పూల మొక్కలునాటుతాం. ఆనకట్టను మరింత అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తాం. – శ్రీనివాస్‌, ఐబీ, డీఈ, వైరా

రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు1
1/1

రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement