బాలికల హ్యాండ్ బాల్ విజేత పశ్చిమ గోదావరి
పిడుగురాళ్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ అండర్ –15 బాలికల విబాగం విజేతగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నిలిచింది. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో పోటీలు హోరోహోరిగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్‌లో పశ్చిమ గోదావరి, విజయనగర్ జట్లు పోటీ పడ్డాయి. పశ్చిమ గోదావరి విజయం సాధించి మొదటి స్థానంలోను, రెండవ స్థానంలో విజయనగరం, మూడవ స్థానంలో కడప, కర్నూలు జట్లు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు తిరుమల ఆక్స్‌ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు షీల్డ్‌లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.


