గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా

Apr 2 2025 1:27 AM | Updated on Apr 2 2025 1:27 AM

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా

చుండూరు(వేమూరు): చుండూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశ కోసం ఈనెల 13వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల ఆరో తేదీన నిర్వహించాల్సిన పరీక్షలు సెక్రటరీ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

రైల్వే ఉద్యోగాల ఉచిత శిక్షణకు 5న ప్రవేశ పరీక్ష

గుంటూరు ఎడ్యుకేషన్‌: రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు రామ్‌ కీ ఫౌండేషన్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు ఎంవీ రామిరెడ్డి, గద్దె భాస్కర్‌, ప్రొఫెసర్‌ లక్ష్మీకుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు గ్రూప్‌– డీ పరీక్షల ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఈనెల 5న రెండు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో అర్హత పరీక్ష నిర్వహించి, ఎంపికై న అభ్యర్థులకు శ్రీధర్‌ ిసీసీఎఫ్‌ సంస్థ నేతృత్వంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు హైదరాబాదులో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. శిక్షణతోపాటు భోజన, వసతి సదుపాయాలతోపాటు స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల్లో వంద మార్కులకు నిర్వహించే అర్హత పరీక్షను 90 నిమిషాల వ్యవధిలో రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ టెలిగ్రామ్‌ గ్రూపును ఫాలో కావచ్చని, మరిన్ని వివరాలకు 9866 777 870 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

పోలీస్‌ శాఖకు కారు బహూకరణ

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): పోలీస్‌ శాఖ అందించే సేవల్లో దాతలు భాగస్వాములు కావాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎస్పీ సతీష్‌కుమార్‌కు కారు పత్రాలు, తాళాలను పయనీర్‌ ఆటోమొబైల్స్‌ అధినేత చుక్కపల్లి రమేష్‌ అందించారు. ఈ మేరకు దాతలైన పయనీర్‌ ఆటోమొబైల్స్‌ అధినేత చుక్కపల్లి రమేష్‌, చేబ్రోలు హనుమయ్య కుమారుడు చేబ్రోలు నరేంద్ర, భారతి కన్జ్యూమర్‌ కేర్‌ ప్రొడక్టస్‌(ట్రిపుల్‌ ఎక్స్‌) అధినేత దివంగత మాణిక్యవేల్‌కు జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ ఐపీఎస్‌ అధికారిణి దీక్ష, జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), సుప్రజ (క్రైం), డీఎస్పీలు భానోదయ (దక్షిణ), ఏడుకొండలురెడ్డి (ఏఆర్‌), నల్లపాడు పీఎస్‌ సీఐ వంశీధర్‌, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement