
ప్రశాంతంగా మొహర్రం పండుగ జరుపుకోండి
– జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
రాయచోటి : జిల్లా ప్రజలు మొహర్రం పండగను ప్ర శాంతంగా జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. గ్రామ పెద్దలు, చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్తేజ భరితంగా జరుపుకొనే ఈ వేడుకలలో అల్లర్లకు తావుండరాదని హెచ్చరించారు. సోదరభావంతో మెలగాలని, చట్ట విరుద్ధగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
భార్య హత్య కేసులో
భర్తకు జీవిత ఖైదు
కడప అర్బన్ : అనుమానంతో భార్యను వేధింపులకు గురి చేస్తూ గొంతునులిమి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త జరిపిటి మల్లికార్జున(41)కు జీవిత ఖైదు, రూ. 1,60,000 జరిమానా విధిస్తూ జడ్జి జిఎస్.రమేష్‌కుమార్ తీర్పు ఇచ్చారు. తంబళ్లపల్లి మండలం మేకావారిపల్లికి చెందిన జరిపిటి మల్లికార్జునకు కడప ఏఎస్‌ఆర్ నగర్‌కు చెందిన తమ్మిశెట్టి రమాదేవి కుమార్తె గంగాదేవితో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లికార్జున పండ్లను విక్రయిస్తూ జీవించేవాడు. భార్య జరిపిటి గంగాదేవి(25)ని రోజూ అనుమానంతో వేధించాడు. 2019 మార్చి, 3న ఉదయం గొంతు నులిమి హత్య చేసినట్లు మృతురాలితల్లి తమ్మిశెట్టి రమాదేవి ఫిర్యాదు చేసింది. అప్పటి తాలూకా సీఐ ఎస్.విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి మల్లికార్జునను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో సాక్ష్లాతో సహా నేరం నిరూపణ కావడంతో కడప కోర్టు జడ్జి మల్లికార్జునకు జీవిత ఖైదు, రూ.1,60,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. సీఐ టి.రెడ్డెప్ప, కోర్ట్ కానిస్టేబుల్ ఎం.రఘురాముడు, కోర్ట్ మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ రాజులను ఎస్పీ ఈజి.అశోక్ కుమార్ అభినందించారు.
ఏసీఏ అండర్–19
మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రో జున వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి న నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 77.3 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మ న్విత్ రెడ్డి 167 బంతులో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 63 పరుగులు చేశాడు చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, ధనుష్‌రెడ్డి 3 వికెట్లు, తేజేష్2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో.....
కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కర్నూలు –అనంతపురం జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 213 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 68 పరుగులు, విఖ్యాత్ 4 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని నవదీప్ 4 వికెట్లు, టివి సాయి ప్రతాప్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. ఆ జట్టులోని కెహెచ్ వీరారెడ్డి 62 పరుగులు చేశాడు.
యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్ల పీపీఎస్ పరిధిలో జరిగిన మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో పోరుమామిళ్ల టౌన్ బెస్త వీధికి చెందిన షేక్ జిలానీ బాషా(26), కలసపాడు మండలం కట్టకిందపల్లికి చెందిన కారు నాగేంద్ర ప్రసాద్(25), పోరుమామిళ్లలోని తురకకోట వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా(26) లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కడప నాలుగో ఏడీజే కోర్టు జడ్జి జి.దీనాబాబు తీర్పు ఇచ్చారు. పోరుమామిళ్ల పీఎస్ పరిధిలోని రామాయపల్లి శ్వశానం వద్ద 2019 జూలై, 11న హత్య జరిగింది. ముగ్గురు నిందితులు మతి స్థిమితం లేని యువతిని గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి వీఆర్‌ఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో యువతి గొంతు నులిమి హత్యచేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం ముగ్గురికీ పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. సీఐ మోహన్ రెడ్డి, సీఐడీ శ్రీనివాసులు, కొండారెడ్డి, వెంకట సుబ్బయ్యలను ఎస్పీ అభినందించారు.
రైళ్లలో పోలీసుల తనిఖీలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. కడప రైల్వే స్టేషన్‌తోపాటు ఎర్రగుంట–కడప మార్గంలో ముంబై నుంచి చైన్నె ఎగ్మోర్ వెళ్తున్న రైలులో కడప మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈగల్, రైల్వే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, పోలీసు, డాగ్ స్క్వాడ్ టీంలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ జనరల్ బోగి నుంచి ఏసీ బోగీల వరకు అన్నింటినీ తనిఖీ చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏర్పాటుచేశారని, ఈ నెంబర్‌కు సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలలో కడప వన్‌టౌన్ ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, కడప రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.