ఇండియా పవరేంటో.. శత్రు దేశానికి తెలిసిన వేళ ఇది..
సైన్యం పొగరేంటో ఉగ్రమూకలకి తెలిసిన క్షణం ఇది...
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా
సాగిన ఆపరేషన్ సింధూర విజయదరహాసం ఇది..
ఇండియన్ ఆర్మీని చూసి ప్రతి భారతీయుడు ఉప్పొంగిన రోజు ఇది..
ఇండియన్ ఆర్మీ సత్తాకు నిదర్శనం
‘ఆపరేషన్ సింధూర్’తో ఇండియన్ ఆర్మీ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. జమ్ము–కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిజాన్నీ దెబ్బ తీసేందుకు, భారతదేశాన్ని విచ్చిన్నం చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా పర్యాటకులను కాల్చి చంపడం దారుణం. ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ బుధవారం తెల్లవారుజామున 25 నిముషాల వ్యవధిలోనే 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రమూకల పీచమణచడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిపై దేశం యావత్తు గర్విస్తోంది. ఉగ్రమూకల ఆటకట్టించడంలో ప్రధాని మోదీ తీసుకునే చర్యలకు ఇండియా అంతా ఒక్కటై మద్దతు తెలుపుతోంది. – వైఎస్ అవినాష్‌రెడ్డి,
కడప పార్లమెంటు సభ్యులు
గర్వించాల్సిన సమయమిది
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం హర్షణీయం. పహల్గాంలో అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై దాడులు నిర్వహించి వారికి సరైన బుద్ధి చెప్ప డం అభినందనీయం. భారతీయుడిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గర్వించాల్సిన సమయమిది. ఏ సంస్థ అయినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అమాయకుల జోలికి వస్తే ఇదేరకంగా బుద్ధి చెప్పాలి. దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి, మన సైన్యానికి అన్ని రకాలుగా తోడుగా, అండగా నిలుద్దాం. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి,
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాకిస్తాన్‌కు వణుకు
భారత ప్రభుత్వం, దేశసైనికులు పెహల్గామ్ దాడులకు నిరసనగా ఉగ్ర వాదులపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయంతో పాక్‌లో వణుకు పుట్టింది. పెహల్గామ్‌లో దాడులు చేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకొన్న భారత సైనికులు సాధించిన విజయం ప్రతి యువకుడికి ఆదర్శం. 9 చోట్ల ఏక కాలంలో దాడులు చేసి 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైనికులకు కృతజ్ఞతలు.
– కొరముట్ల శ్రీనివాసులు,
రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే
యావత్ భారతదేశం గర్విస్తోంది
ఇండియన్ ఆర్మీ సింధూర్ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేయడంతో యావత్ భారతదేశం గర్వపడుతోంది. ఉగ్రవాదులు పహల్గాంలో సృష్టించిన మారణహోమానికి ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం చెప్పింది. పహల్గాం సంఘటన జరిగినప్పటి నుంచి భారతీయులందరూ ఉగ్రవాదంపై ఎంతో కసిగా ఉన్నారని, పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు ధీటుగా సమాధానం చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. భారతీయులందరు కోరుకున్న విధంగానే ఇండియన్ ఆర్మీ సింధూర్ ఆపరేషన్‌తో తగిన గుణపాఠం చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. ఆపద వస్తే భారతీయులంతా ఏకమవుతారనేందుకు పహల్గాం సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఇండియన్ ఆర్మీ ఎంతో శక్తివంతమైనదని.. ఎవరూ భయపడాల్సిన అవ సరం లేదు. – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశానికే గర్వకారణం. పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై జరిపిన దాడికి, అంతకుముందు పుల్వామాలో చేసిన దాడికి...దీటైన జవాబు ఇచ్చినందుకు భారత సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రస్తుత సందర్భంలో పార్టీలకు అతీతంగా దేశం ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది.
– నిసార్ అహ్మద్,
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి