
మొత్తం జనాభాలో 0–19 ఏళ్ల మధ్య పిల్లలు 2011లో 40.9 శాతం
2026 నాటికి 32 శాతానికి తగ్గిపోతుంది
సంతానోత్పత్తి రేటు తగ్గుదలే కారణం
భారతదేశంలో పిల్లలు–2025 నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. 2011 నుంచి 2026 వరకు మొత్తం జనాభాలో 0–19 ఏళ్ల మధ్య పిల్లల జనాభా 8.9 శాతం తగ్గిపోతోందని దేశంలో పిల్లలు–2025 నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది.
2011లో మొత్తం జనాభాలో పిల్లలు 40.9 శాతం ఉండగా.. 2026 నాటికి 32 శాతానికి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఇందుకు ప్రధాన కారణం సంతానోత్పత్తి రేటు తగ్గడమేనని పేర్కొంది. అన్ని వయసుల పిల్లల జనాభాలో తగ్గుదల ధోరణి కనిపిస్తోందని వేదిక తెలిపింది.
