
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా ప్రజల ప్రాణాలు బలిఅవుతున్నాయి. టీడీపీ సభల్లో చంద్రబాబు, టీడీపీ సభ నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగా గడిచిన 5 రోజుల్లో 11 మంది మృతిచెందారు. కాగా, ఈ ఘటనలపై మంత్రులు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు సభ ప్రమాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నాని ట్విట్టర్ వేదికగా.. ‘ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది మరియు గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!’ అని ఘాటుగా కామెంట్స్ చేశారు.
ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది మరియు గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!@TV9Telugu @NtvTeluguLive @tv5newsnow @10TvTeluguNews @abntelugutv @SakshiHDTV
— Perni Nani (@perni_nani) January 2, 2023
మరోవైపు.. ఈ ప్రమాదాలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ‘చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !’.. ‘నిన్న కందుకూరులో 8 మంది మృతి. నేడు గుంటూరులో ఇప్పటికి 3 మృతి. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి !’ అని వ్యాఖ్యలు చేశారు.
చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !@ncbn @naralokesh
— Ambati Rambabu (@AmbatiRambabu) January 2, 2023