
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
అనంతపురం అర్బన్: బాలకార్మిక వ్వవస్థను నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. బాలకార్మిక వ్వవస్థ నిర్మూలనపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జేసీ సమీక్షించారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలకార్మికులు, డ్రాపౌట్లను గుర్తించి సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలకు విముక్తి కల్పించాలన్నారు. బాలకార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధిబాలలు, యాచన చేస్తున్న వారిని గుర్తించడంతో పాటు పునరావాసం కల్పించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి
అధికారులకు జేసీ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశం