
ఆటో డ్రైవర్ నిజాయితీ
రావికమతం: పోగొట్టుకున్న బంగారు ఆభరణం తిరిగి ఇచ్చిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్ నిజాయితీని పలువురు అభినందించారు. కొత్తకోట శాంతి యూనియన్ సభ్యుడు, కొత్తకోట గ్రామానికి చెందిన కొప్పు శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు కొత్తకోట నుంచి నర్సీపట్నం ప్రయాణికులను తీసుకెళ్లి వస్తుంటారు. 16 రోజుల క్రితం నర్సీపట్నం నుంచి కొత్తకోటకు ప్రయాణికులను తీసుకెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బంగారం లాకెట్‌ను ఆటోలో జారవిడుకున్నాడు. చివరలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ బంగారం లాకెట్టును గుర్తించి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిపై విచారణ అనంతరం చెట్టుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిగా నిర్ధారించుకున్నాడు. ఆమె గుంటూరులో చదువుతుండడంతో ఆదివారం యూనియున్ సభ్యులు ఆధ్వర్యంలో ఆమె తండ్రి రాముకు కొత్తకోటలో లాకెట్‌ను అందజేశారు.