
ప్రణాళికతో వనాల అభివృద్ధి
● అటవీశాఖ రేంజర్ మురళీకృష్ణ
ముంచంగిపుట్టు: వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అటవీశాఖ ముంచంగిపుట్టు రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఇక్కడ రేంజర్‌గా పనిచేసిన వెంకయ్య చౌదరికి విశాఖ పట్నం బదిలీ అయింది. ఆయన స్థానంలో తిరుపతిలో రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారిగా పనిచేస్తున్న మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సరఫరాకు సిద్ధంగా ఉన్న మొక్కల వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. సెక్షన్ అధికారులు సీహెచ్ నారాయణపడాల్, ఎం. కార్తీక్, సుజనశ్రీ, బీట్ అధికారులు కె.శ్రీను, ఎం. రామారావు, అనుషా పాల్గొన్నారు.