
సంపద కేంద్రం పరిశీలన
జి.మాడుగుల: మండలంలోని సింగర్భ, కె.కోడాపల్లి పంచాయతీల్లో శనివారం జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ పర్యటించారు. దీనిలో భాగంగా సింగర్భ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్త సేకరణ, సంపద కేంద్రంపై అవగాహన కల్పించారు. ప్రతీ కుటుంబానికి తడి, పొడి చెత్త సేకరణకు వేర్వేరుగా రెండు బుట్టలు అందజేశారు. ఆరోగ్య అలవాట్లు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు గంగరాజు, పంచాయతీ కార్యదర్శి రవిశాస్త్రి పాల్గొన్నారు.