
హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన
పాడేరు రూరల్: హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ఆరోపించారు. శనివారం ఆయన పాడేరులో మాట్లాడుతూ జిల్లాలోని అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దకోట జీనబాడు, గుజ్జలి, చిట్టంపాడు ప్రాంతాల్లో ఏడు వేల ఎకరాలు సేకరించి నవయుగ కంపెనీకి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గిరిజన ప్రాంతా ఖనిజ సంపదలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అదానీతో చేతులు కలిపిందన్నారు. ఐదో షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అనుమతి లేకుండాఎటువంటి ప్రాజెక్టులు, కంపెనీలు ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేయకూడదన్నారు. గిరిజన చట్టాలు, హక్కుల ధిక్కరణ రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లోని రెండు లక్షల పీవీటీజీ, ఆదివాసీ గిరిజన కుటుంబాలు ముంపునకు గురవుతున్నారన్నారు. బాకై ్సట్ ఉప్పందాల మాదిరిగానే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఇచ్చేందుకు కూటమి న్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 1800 మెగావాట్లకు పెంచి అనుమతులు ఇచ్చేందుకు ప్రతిపాదించి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అప్పలనర్స, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం