
వాల్తేరు డీఆర్‌ఎం స్టీల్‌ప్లాంట్ సందర్శన
ఉక్కునగరం: వాల్తేరు డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా మంగళవారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. రైల్వే, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ల మధ్య సహృద్భావ సంబంధాల పెంపు, సరుకు రవాణా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల సమన్వయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆయన రైల్వే అధికారుల బృందంతో సహా స్టీల్‌ప్లాంట్‌కు విచ్చేశారు. సమావేశంలో సరుకుల రవాణా పెంపు, రేక్ నిర్వహణలో సామ ర్థ్యం పెంచడం, ప్రణాళికాయుతంగా ఇరు సంస్థల మధ్య వాణిజ్యం అభివృద్ధి తదితర అంశాలను చర్చించారు. రేక్ రిటెన్షన్ టైమ్ తగ్గించడం, మొత్తం కార్యాచరణ పనితీరును పెంచడానికి లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం వంటి విషయాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె.బాగ్చీతో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పాల్గొన్నారు.