
ఘనంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలు
పాడేరు : స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను మంగళవారం పాడేరులో వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ్లన్నదొర, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, తదితరులు బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో రోగులు, గర్భిణులు, బాలింతలకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
చింతపల్లి: స్థానిక ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో పాడేరు శాసన సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్,సర్పంచ్ దురియా పుష్పలత,మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జల్లి హలియారాణి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్‌చేసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచి మనస్సుతో విశ్వేశ్వరరాజు అందరి మన్ననలు పొందారని చెప్పారు.పార్టీ ప్రా రంభం నుంచి అనేక పదవులు అలంకరించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదిర్శి జల్లి సుధాకర్, ఎంపీటీసీలు నాగలక్ష్మి, జయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు నాజర్‌వలీ, మాజీ ఎంపీపీ బూసరి కృష్ణారావు, పార్టీ నాయకులు సాగిన గంగన్నపడాల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జీకే వీధిలో..
గూడెంకొత్తవీధి: పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను మంగళవారం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి ఆధ్వర్యంలో మండలకేంద్రం జీకే వీధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయా లని వారంతా ఆకాంక్షించారు. పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,దామణాపల్లి సర్పంచ్ రామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రాజు,యువజన విబాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, లంబసింగి నరేశ్, అరకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివకుమార్ పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలు