
సాగర తీరాన సైకిల్‌పై సవారీ
ఏయూక్యాంపస్: ఆదివారం వచ్చిందంటే చాలు సాగర తీరాన బీచ్ రోడ్డు చిన్నారులు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయసుల నగరవాసులతో నిండిపోతుంది. ఎవరికి వారు తమకు నచ్చిన వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తుంటారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్డులో పలువురు యువత, చిన్నారులు సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. ఉదయం 7 గంటల వరకు వాహనాల నిషేధం ఉండటంతో చిన్నారులు స్వేచ్ఛగా బీచ్ రోడ్డులో సైకిల్‌పై సవారీ చేసే అవకాశం లభించింది. వీరు వైఎంసీఏ నుంచి ఆర్.కె.బీచ్ వరకు విరామం లేకుండా సైకిల్ తొక్కుతూ స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.

సాగర తీరాన సైకిల్‌పై సవారీ