
చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలకు కష్టాలు
ఎటపాక: అధికారంలో రావాలనే కాంక్షతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. శనివారం మండలంలోని పురుషోత్తపట్నంలో జరిగిన పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాలనే తపనతో ప్రమాణాలు చేస్తూ పథకాల ఆశ చూపి ఇంటింటికి బాండు పత్రాలు పంచి మోసం చేశారన్నారు. ఏడాది కాలంగా సంక్షేమం, అభివృద్ధి లేకుండా చేసి ప్రజలను కష్టాల పాల్జేశారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, మహిళలకు ఏడాది సాయం, రైతన్నలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం సవాలక్ష నిబంధనలు పెట్టి పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. ఏడాది పాలనలో ఇంత ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏదీ లేదన్నారు. అబద్ధపు హామీలు, తప్పుడు మాటలు చెప్పే నైజం జగన్‌ది కాదన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని వారికి ఏకష్టమొచ్చినా అండగా ఉంటామని కార్యకర్తల జోలికి అధికార పార్టీ నేతలు వస్తే చూస్తూ ఊరుకోమని అనంతబాబు హెచ్చరించారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత పటిష్టతకు కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాక కామేశ్వరి, ఎంపీటీసీలు గొంగడి వెంకట్రామిరెడ్డి, అంజలి, వెంకటరమణ, కమల, సర్పంచ్‌లు, ఇంగిలపు బేబి, గుండి సీతాలక్ష్మి, రాంబాబు, ఆదినారాయణ, కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు, పార్టీ ప్రతినిధులు దామెర్ల రేవతి, కురినాల వెంకట్, మంత్రిప్రగడ నర్సింహరావు, ఆవుల మరియాదాసు, కృష్ణబాబు, మోసం కన్న, నవీన్, రాము, నాగేశ్వరావు, జయచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే
నాగులపల్లి ధనలక్ష్మి విమర్శ