
కొమ్మింగి ఘాట్‌లో ఆటో బోల్తా
చింతపల్లి: మండలంలోని కొమ్మింగి ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కొమ్మింగి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన చింతపల్లి బయలు దేరిన ఆటో మార్గం మధ్యలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికుల్లో నలుగురికి తీవ్రంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకురావడంతో అత్యవసవర వైద్యం అందించారు. తీవ్ర గాయాలైన కుడుముల దేవమ్మ, పాంగి చంద్రమ్మ, పాంగి పెద్దమ్మ, పాంగి జానికమ్మను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలింపు