
ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
రావికమతం : పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన రావికమతం మండలం కొత్తకోటకు చెందిన యువకుడు సాలాపు రామ్ కుమార్ (రాంకీ), విశాఖపట్నం కేజిహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రామ్ కుమార్(రాంకీ)కు రెండు కిడ్నీలు పనిచేయక పోవడంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్‌కుమార్, మరో యువకుడు తురాల శేషుతో కలిసి నర్సీపట్నం శ్రీరామ్ చిట్స్ అండ్ ఫైనాన్స్‌లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. రికవరీ చేయడానికి బైక్‌పై విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.