
జాతీయ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షం
చింతపల్లి: చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం నేల కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనాలు రాకపోకలకు రెండు గంటలు పాటు అంతరాయం ఏర్పడింది. పెదబరడ పంచాయతీ పరిధిలో గల రాజుపాకలు–దిగువుపాకలు గ్రామాల మధ్యలో గల జాతీయ రహదారి మధ్యలో ఈ భారీ వృక్షం కూలడంతో నర్సీపట్నం నుంచి సీలేరు, భద్రాచలం, సీలేరు ,గూడెం కొత్తవీధి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, జీపులు, వ్యాన్‌లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే జాతీయ నిర్మాణంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న,చిన్న వృక్షాలతో పాటు భారీ, అతిభారీ వృక్షాలను సైతం తొలగించారు. అయినప్పటికీ చింతపల్లి నుంచి తాజంగి వరకూ రహదారికి దూరంగా మరి ఎన్నో వృక్షాలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి.ఇటీవల వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది.దాంతో వేళ్లు జీవం పోవడంతో నేలకూలింది. వెంటనే స్పందించిన జాతీయ రహదారి అదికారులు రాకపోకలు సాగించే విధంగా చర్యలు చేపట్టారు. దీంత యధావిధిగా రాకపోకలు కొనసాగాయి.
రెండు గంటలపాటు
స్తంభించిన రాకపోకలు

జాతీయ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షం