
రక్తదానంతో ప్రాణదానం
పాడేరు : సమాజంలో ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని డీఎంహెచ్‌వో డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. ఎస్‌బీఐ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పాడేరు స్టేట్‌బ్యాంకు బ్రాంచిలో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యాంక్ ఖాతాదారులు, సిబ్బంది స్వచ్ఛందంగా తరలివచ్చి 74 యూనిట్ల రక్తదానం చేశారు. స్టేట్‌బ్యాంకు ఇండియా అనకాపల్లి యూనియన్ రీజనల్ సెక్రటరీ పైలా ప్రసాద్‌రావు తదితరులు మాట్లాడారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ ఎం.కిరణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమల, పాడేరు ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవికిరణ్, శ్రీనివాసనాయుడు, పాడేరు బ్రాంచి లోకల్ యూనియన్ సెక్రటరీ డీఎంఎన్ శ్రీనివాస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి గంగరాజు, ప్రతినిధులు గౌరినాయుడు, సూర్యారావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
ఆపదలోఉన్నవారిని ఆదుకోవాలి :
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో అరకు ఎస్‌బీఐ యూనియన్ కార్యదర్శి వంతాల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిబిరం నిర్వాహకులు, రక్తదాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కుమ్మిడి ఆశోక్, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాము పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ తమర్బ
విశ్వేశ్వరనాయుడు
పాడేరులో 74 యూనిట్ల సేకరణ

రక్తదానంతో ప్రాణదానం

రక్తదానంతో ప్రాణదానం