
ముంచంగిపుట్టులో దొంగలు హల్‌చల్
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. మరో దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. గురువారం ఉదయం దుకాణాలు తెరిచేందుకు వచ్చిన యజమానులు వచ్చేసరికి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందగా పడిఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నాగరాజుకు చెందిన కేవీఆర్ మెడికల్ అండ్ స్టేషనరీ, అప్పారావుకు చెందిన బార్బర్ దుకాణాల తాళాలు పగలగొట్టారు. వీటిలో వస్తువులు, రూ.5 వేల వరకు నగదు తీసుకొని వెళ్లిపోయారు. ఇదే ప్రాంతంలోని ప్రభాకర్ కిరాణా దుకాణంలో చోరీకి యత్నించారు. తలుపు తాళాలు పగులగొట్టినా తలుపులు తెరచుకోకపోవడంతో వెళ్లిపోయారు. చోరీ విషయాన్ని యజమానులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఏఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది పరిశీలించారు. బాధిత యజమానుల నుంచి వివరాలు సేకరించారు. దొంగతనాలు మళ్లీ మొదలు కావడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. వీటిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
రెండు దుకాణాల్లో చోరీ
తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, రూ.5వేల నగదు అపహరణ
ఆందోళన చెందుతున్న స్థానికులు

ముంచంగిపుట్టులో దొంగలు హల్‌చల్

ముంచంగిపుట్టులో దొంగలు హల్‌చల్